Site icon NTV Telugu

Kantara: ఓటిటీలో ‘కాంతార’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

Kantara

Kantara

Kantara: ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతారా ఫీవర్ నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాను ఎన్నిసార్లు థియేటర్ లో చూసినా తనివితీరడం లేదని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ బాట పడుతుందా.,.? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా నవంబర్ 4 నుంచి ఆహా లో స్ట్రీమ్ అవుతుందని పుకార్లు కూడా వచ్చేశాయి. దీంతో అభిమానులు ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ ఈ సినిమా నిర్మాత ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. నవంబర్ 4 న ఓటిటీ లో వస్తున్నది అని వస్తున్న రూమర్స్ లో నిజం లేదని తేల్చి చెప్పాడు.

నిర్మాత కార్తీక్ గౌడ ఈ రూమర్స్ పై స్పందిస్తూ.. కాంతార ఓటిటీ గురించి వస్తున్న వార్తలో నిజం లేదు. ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటిటీలో రాదు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చాడు. దీంతో కాంతార అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిర్మాత చెప్పడం అని కాదు కానీ విజయవంతంగా ఆడుతున్న సినిమాను ఓటిటీ లో రిలీజ్ చేయాలనీ ఎవరు కోరుకోరు కదా.. వచ్చేహ్ నెల చివరి వారంలో ఈ సినిమా ఓటిటీ బాట పడుతుందేమో చూడాలి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version