Site icon NTV Telugu

Kantara: రూ.400 కోట్ల సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..!!

Kantara Movie

Kantara Movie

Kantara: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్‌లో రూ.400 కోట్లు రాబట్టిన సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ మూవీ భూతకోల అనే ట్రెడిషన్ చుట్టూ అల్లిన కథ. ఒక రీజనల్ సినిమాకి ఇంత సత్తా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగించేలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇటివలే 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 30న విడుదలైన కాంతారా సినిమా ఇప్పటికీ 800 నుంచి వెయ్యి థియేటర్లలో రన్ అవుతోంది. ఏడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేస్తున్న కాంతారా సినిమా ఒటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Read Also: Veera Simha Reddy: నవంబర్ 25న ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్!

థియేటర్లలో ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌నే రాబడుతున్న కాంతారా సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 24 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్, వాళ్ల ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. హోంబెల్ ఫిల్మ్స్ నిర్మించిన గత సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజ్ అయ్యాయి. అయితే లార్జ్ సెక్టార్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకోని తెరకెక్కించిన ఎన్నో సినిమాలు, థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించాయి. కానీ టీవీలు, మొబైల్ స్క్రీన్స్‌లో అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఆ గ్లిచ్‌ను బ్రేక్ చేసి కాంతారా సినిమా థియేటర్లలో మాత్రమే కాదు ఒటీటీలో కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

Exit mobile version