Hombale: కాంతర హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ‘రాజ్ కుమార్’ వారసుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబలే, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మనవడు అయిన ‘యువ రాజ్ కుమార్’ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ‘యువ’ అనే సినిమాచేస్తోంది. పునీత్ రాజ్ కుమార్ కి సూపర్ హిట్స్, యష్ ని సూపర్ స్టార్ ని చేసిన రైటర్-డైరెక్టర్ సంతోష్ ఆనంద్ దర్శకత్వంలో ‘యువ’ సినిమా తెరకెక్కుతోంది.
రీసెంట్ గా ఒక వీడియోతో యువ రాజ్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేసిన మేకర్స్, ఆ వీడియోలోనే ‘యువ’ మూవీ టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో యువ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. టైటిల్ టీజర్ కి అజ్నీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెమండస్ గా ఉంది. ఇటీవలే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో యువ రాజ్ కుమార్ పక్కన హీరోయిన్ గా కాంతర ఫేమ్ సప్తమీ గౌడని ఫైనల్ చేసారు. ఈరోజు సప్తమీ గౌడ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ ‘హ్యాపీ బర్త్ డే సిరి’ అంటూ సప్తమీ గౌండ పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో ‘యువ’ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరి యువ సినిమాతో యువ రాజ్ కుమార్ కి పాన్ ఇండియా రేంజ్ డెబ్యు దొరుకుతుందా? హోంబలే బ్రాండ్ వేల్యూతో రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త స్టార్ హీరో పుట్టుకొస్తాడా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..