Site icon NTV Telugu

Manchu Manoj : మా అన్న అదరగొట్టాడు.. ప్రభాస్ వచ్చాక వేరే లెవల్..

Manoj

Manoj

Manchu Manoj : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్పప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మంచు మనోజ్ ప్రసాద్ ఐ మాక్స్ లో సినిమా చూసి మీడియాతో మాట్లాడారు. సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దాని కంటే వెయ్యి రేట్లు బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ వచ్చిన తర్వాత వేరే లెవల్ లో ఉంది. ఇంత అద్భుతంగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చివరి 20 నిముషాలు అదిరిపోయింది. మా అన్న అద్భుతంగా చేశాడు. ఇది మా నాన్న, వాళ్ల టీమ్ ఏళ్ల కృషి. మూవీ నెక్ట్స్ లెవల్ లో ఉంది.

read also : Kolkata: లా కాలేజ్‌లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో తృణమూల్ నేత..

వాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. పెట్టిన ప్రతి రూపాయికి వెయ్యి రేట్లు రావాలి అని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయిన కన్నప్ప.. మంచి పాజిటివ్ టాక్స్ తో దూసుకుపోతోంది.

సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సీన్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. రుద్ర పాత్రలో ఆయన అదరగొట్టాడు అంటున్నారు ప్రేక్షకులు. ఎన్నో ట్రోల్స్ తో మొదలైన కన్నప్ప జర్నీ.. రిలీజ్ టైమ్ వరకు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి వారు నటించడం కలిసొచ్చింది.

read also : KL Rahul: దేశానికే తొలి ప్రాధాన్యం.. కేఎల్‌ రాహుల్‌ సూపర్!

Exit mobile version