Site icon NTV Telugu

Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్

Kannappa 2

Kannappa 2

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ ను మంచి స్పందన రాబట్టింది.

Also Read : Kannappa : కన్నప్ప ఓవర్సీస్ రివ్యూ..

ముఖ్యంగా తమిళ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో నాథనాధుడి క్యారక్టర్ లో గంబీరమైన వాయిస్ తో మెప్పించాడు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మహాదేవ శాస్త్రిగా జీవించేసాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ ప్రభాస్. సినిమాలో కీలకమైన 40 నిముషాల ఎపిసోడ్ ను ప్రభాస్ నిలబెట్టేసాడు. ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్ పెన్నుకు పదును పెట్టాడు. ప్రభాస్ పెళ్లి డైలాగ్ కు థియేటర్స్ హోరెత్తాయి. ఇక  శివయ్య కు తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. ఈ సినిమా కథను నమ్మి ఇంత భారీ స్థాయిలో నిర్మించిన మోహన్ బాబు, విష్ణు ను మెచ్చుకుని తీరాలి. సాంగ్స్ తో పాటు నేపధ్య సంగీతం మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది.

Exit mobile version