Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో దర్శకులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన ఆమె, ఈ క్రమంలో సూపర్ స్టార్ల తీరును తప్పుబట్టారు. తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’ సాధిస్తున్న అఖండ విజయంపై స్పందిస్తూ, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు పెట్టారు. హాలీవుడ్‌లో స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్వింటిన్ టరాన్టినో, క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకులకు అక్కడి అగ్ర హీరోల కంటే ఎక్కువ గౌరవం, గుర్తింపు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కానీ, భారతీయ చిత్ర పరిశ్రమలో మాత్రం దర్శకులకు సరైన క్రెడిట్ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:Dhurandhar 2: సొంత భర్త సినిమాకు రాని దీపిక.. అసలేం జరుగుతోంది!
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
మన ఇండస్ట్రీలో దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువని కంగనా ఆరోపించారు. ఇక్కడి సూపర్ స్టార్లు దర్శకులను వేధిస్తారని, దానివల్ల కొత్తగా వచ్చే యువత కేవలం నటులు కావాలని అనుకుంటున్నారే తప్ప, డైరెక్టర్లు లేదా సినిమాటోగ్రాఫర్లు కావాలని కలలు కనడం లేదని ఆమె విశ్లేషించారు. “ధురంధర్ 2 విజయంతో ఆదిత్య ధర్ ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఏ హీరో కంటే తక్కువ కాకుండా ఆయన మెరుస్తున్నారు. ఇది చూసి భవిష్యత్తులో ఎంతోమంది యువత దర్శకులు కావాలని ఆశిస్తారు” అని కంగనా పేర్కొన్నారు. ఆదిత్య ధర్ సినిమా విజయాన్ని ఆకాశానికెత్తిన కంగనా, తన పోస్ట్‌లో ఎక్కడా హీరో రణవీర్ సింగ్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం దర్శకుడిని మాత్రమే ట్యాగ్ చేస్తూ ఆమె ప్రశంసలు కురిపించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..