Site icon NTV Telugu

Kangana Ranaut: వాళ్లందరు ఫెయిల్యూర్స్.. బాలీవుడ్ స్టార్స్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు

Kangana Ranaut

Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా తప్పును ఎత్తి చూపడంతో ఆమెకున్న తెగువ మరే హీరోయిన్ కి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే అమ్మడు లాకప్ షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే .. ఈ షో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. దీంతో కంగనా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ అనడంలో కంగనా బాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కంగనా ఒక పోస్ట్ పెట్టింది. ” బాలీవుడ్ లో షారుక్ ఖాన్ , అక్షయ్ కుమార్,  ప్రియాంక చోప్రా, రణ్‌వీర్‌సింగ్ వంటి చాలామంది నటులు పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ వాళ్లందరూ హోస్ట్ గా ఫెయిల్ అయ్యారు. అయితే అమితాబ్ బచ్చన్ జీ, సల్మాన్ ఖాన్ జీ, అలాగే కంగనా రనౌత్ మాత్రమే అలా రెండింట్లో ఇప్పటి వరకూ విజయవంతమయ్యారు. ఇలా సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది.

సినిమా మాఫియా నాపై అసూయతో నన్ను, నా షోను అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. కానీ అది వారివల్ల కాదు. ఎందుకంటే నా షోను నేను రక్షించుకుంటాను. నన్ను ఎంతమంది విమర్శించినా పట్టించుకోను.. నేను ఇతరులకు సపోర్ట్ ఇస్తేనే.. నాకు నేను నిలబడగలను. ఈతరం హోస్ట్ లలో నేను విజయం సాధించడం నాకు సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా కంగనా అన్న మాటలు బాలీవుడ్ లో కలకలం రేపే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న బడా నిర్మాత కరణ్ పై విరుచుకుపడ్డ ఈ భామ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్స్ ని పేర్లతో సహా ఫెయిల్యూర్ అని చెప్పడం వారి ఫ్యాన్స్ కి మింగుడుపడడంలేదు. మరి ఈ పోస్ట్ మరో వివాదం తెస్తుందా..?లేదా అనేది చూడాలి

Exit mobile version