Kangana Ranaut: వాళ్లందరు ఫెయిల్యూర్స్.. బాలీవుడ్ స్టార్స్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా తప్పును ఎత్తి చూపడంతో ఆమెకున్న తెగువ మరే హీరోయిన్ కి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే అమ్మడు లాకప్ షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే .. ఈ షో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. దీంతో కంగనా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ అనడంలో కంగనా బాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కంగనా ఒక పోస్ట్ పెట్టింది. ” బాలీవుడ్ లో షారుక్ ఖాన్ , అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్‌వీర్‌సింగ్ వంటి చాలామంది నటులు పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ వాళ్లందరూ హోస్ట్ గా ఫెయిల్ అయ్యారు. అయితే అమితాబ్ బచ్చన్ జీ, సల్మాన్ ఖాన్ జీ, అలాగే కంగనా రనౌత్ మాత్రమే అలా రెండింట్లో ఇప్పటి వరకూ విజయవంతమయ్యారు. ఇలా సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది.
సినిమా మాఫియా నాపై అసూయతో నన్ను, నా షోను అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. కానీ అది వారివల్ల కాదు. ఎందుకంటే నా షోను నేను రక్షించుకుంటాను. నన్ను ఎంతమంది విమర్శించినా పట్టించుకోను.. నేను ఇతరులకు సపోర్ట్ ఇస్తేనే.. నాకు నేను నిలబడగలను. ఈతరం హోస్ట్ లలో నేను విజయం సాధించడం నాకు సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా కంగనా అన్న మాటలు బాలీవుడ్ లో కలకలం రేపే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న బడా నిర్మాత కరణ్ పై విరుచుకుపడ్డ ఈ భామ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్స్ ని పేర్లతో సహా ఫెయిల్యూర్ అని చెప్పడం వారి ఫ్యాన్స్ కి మింగుడుపడడంలేదు. మరి ఈ పోస్ట్ మరో వివాదం తెస్తుందా..?లేదా అనేది చూడాలి
Also Read
తాజావార్తలు
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!