బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా సౌత్ స్టార్ యష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ బీ టౌన్ క్వీన్ అనిపించుకున్న కంగనా ఇంతకు ముందు దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. అయితే డేట్స్ క్లాష్ కారణంగా చేయలేకపోయింది. అయితే ఈ విషయం ఆమెకు సౌత్ సినిమాపై ప్రేమను చూపించకుండా ఆపలేకపోయింది. ఇటీవల RRRని వీక్షించిన కంగనా రాజమౌళి దర్శకత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనా సినీ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2″పై కామెంట్స్ చేసింది. యష్‌ని లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చింది.
Read Also : Nikesha Patel : ఏ మెగా స్టార్ గురించి మాట్లాడుతున్నారు ? నెటిజన్ కు పవన్ హీరోయిన్ ప్రశ్న
“అనేక దశాబ్దాలుగా భారతదేశం మిస్ అయిన యాంగ్రీ యంగ్ మ్యాన్ యష్… డెబ్బైల నుండి అమితాబ్ బచ్చన్ మిగిల్చిన ఆ శూన్యతను ఆయన భర్తీ చేశాడు… అద్భుతం” అంటూ ‘కేజీఎఫ్” స్టార్ పై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇంకేముంది యష్ ని కంగనా బాలీవుడ్ మెగాస్టార్ తో పోల్చడం ఆయన అభిమానులను ఫిదా చేసేసింది. ఇంతకుముందు కూడా కంగనా సౌత్ స్టార్స్, నార్త్ స్టార్స్ మధ్య పోలిక చెబుతూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ భారీ ఎత్తున నిర్మించిన KGF 2 ఇప్పటికే ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టింది. కన్నడ వెర్షన్ తో పోలిస్తే తెలుగు, హిందీ భాషల్లో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది.
