NTV Telugu Site icon

Kangana Ranaut: ముందుంది ముసళ్ల పండగా.. ఆ నిర్మాతకి కంగనా వార్నింగ్

Kangana Warns Karan

Kangana Warns Karan

Kangana Ranaut Gives Strong Warning To Karan Johar: ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. సందర్భం వస్తే చాలు.. అతనిపై ఉగ్రరూపం దాలుస్తుంది. అతని వల్లే సినీ పరిశ్రమ చెడిపోయిందని, బ్యాక్‌గ్రౌండ్ లేని వారి కెరీర్‌లను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ప్రియాంకా చోప్రా చెప్పినప్పుడు కూడా.. కంగనా రనౌత్ రంగంలోకి దిగి, కరణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రియాంకా చెప్పింది నిజమేనని, హిందీ సినీ పరిశ్రమలో కరణ్ జోహార్ రాజకీయాలు నడిపిస్తున్నాడని, షారుఖ్‌తో ప్రియాంకా క్లోజ్‌గా ఉండటం నచ్చక ఆమెను పరిశ్రమ నుంచి వెళ్లిపోయేలా టార్చర్ పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. అనుష్క శర్మ కెరీర్‌ను కూడా దెబ్బతీశాడని ఆరోపించింది.

Balochistan Bomb Blast: బలూచిస్తాన్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 18 మందికి గాయాలు

ఇలా తనపై కంగనా చేసిన ఆరోపణలపై కరణ్ జోహార్ ఇటీవల స్పందించాడు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా తాను తలొగ్గనని, ఆ అబద్ధాలు తనకు ఎలాంటి నష్టం కలిగించవని అన్నాడు. తనను ఎవరు ఎంత దూషించినా, చెడుగా చూపించాలని ప్రయత్నించినా భయపడేది లేదని తేల్చి చెప్పాడు. మీరంతా అబద్ధాలకు బానిసలవుతున్నారని, అయినా తాను వాటికి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. మీరు కత్తి ఎత్తినా సరే, తాను చనిపోయే రకం కాదని స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చాడు. దీనిపై కూడా కంగనా రియాక్ట్ అయ్యింది. ఇన్‌స్టా స్టోరీలో కరణ్ పోస్ట్‌ని షేర్ చేస్తూ.. అతని హిందీ భాషపై వ్యంగ్యాస్త్రాలు చేసింది. గతంలో తనకు ఇంగ్లీష్ భాష రాదన్న కారణంతో.. జాతీయ మీడియాలో తనని అమానించాడని పేర్కొంది. ఇప్పుడు కరణ్ హిందీ చూస్తుంటే, బాగానే మెరుగుపడినట్టు అర్థమవుతోందని తెలిపింది. ‘‘రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూస్తూ ఉండు’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Extramarital Affair: భార్య కిరాతకం.. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి..

Show comments