నేడు ముంబై పోలీసుల ఎదుటకు కంగనా… సిక్కు వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సిక్కు వివాదంలో ఈరోజు ముంబై పోలీసుల ఎదుట హాజరు కానుంది. కంగనా బుధవారం తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంగనా రనౌత్ ఈరోజు ఉదయం 11 గంటలకు తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఖార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవచ్చు.
సిక్కు వివాదం ఏంటి ?
వాస్తవానికి కంగనా తన సోషల్ మీడియా పోస్ట్‌లలో ఒకదానిలో రైతుల ఉద్యమాన్ని వేర్పాటువాద గ్రూపుతో ముడిపెట్టి, సిక్కు సంఘంపై వ్యాఖ్యానించింది. దీంతో ఆగ్రహానికి గురైన సిక్కు సంస్థ ఫిర్యాదు మేరకు గత నెలలో ఖార్ పోలీస్ స్టేషన్లో రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి కంగనా ముంబై పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలో ఆమెను విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 22న ఖార్ పోలీసుల ఎదుట హాజరు అవుతుందని కంగనా తరపు న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు.
Also Read
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
Read Also :
కంగనా అరెస్ట్ కు గడువు ?
కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ “హైకోర్టు ఆదేశాల స్ఫూర్తి, ఉద్దేశ్యం ప్రకారం మేము దర్యాప్తు అధికారిని ముందస్తు తేదీ కోసం అభ్యర్థించాము. కోర్టు తదుపరి విచారణలోపు ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటున్నాము. అయితే దర్యాప్తు అధికారులు నా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించలేదు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే అతనికి పంపిన లేఖకు కూడా అతను స్పందించలేదు. ఇప్పుడు నా క్లయింట్ అందుబాటులో ఉన్న ఏదైనా సమీప తేదీలో పోలిసుల ఎదుట హాజరవుతారు. అధికారులు మాకు సమయం ఇవ్వకపోతే దాని యోగ్యతపై నిర్ణయం తీసుకునే విషయాన్ని హైకోర్టుకు వదిలివేస్తాము. రైతుల నిరసనలను వేర్పాటువాద గ్రూపుతో ముడిపెట్టిన ఆమె సోషల్ మీడియా పోస్ట్‌పై రనౌత్‌ను 2022 జనవరి 25 వరకు అరెస్టు చేయబోమని ముంబై పోలీసులు గతంలో బాంబే హైకోర్టుకు తెలిపారు” అని అన్నారు. దీంతో కంగనా ఈరోజు ముంబై పోలిసుల ఎదుట హాజరై తన స్టేట్మెంట్ ఇస్తుందని అంటున్నారు.
ఇదీ జరిగింది !
కంగనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఒకదాని తర్వాత సిక్కు సంఘంలోని కొంతమంది సభ్యులు నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభివర్ణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖర్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ రనౌత్ ఈ నెల ప్రారంభంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కంగనా కామెంట్స్ భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు అని హైకోర్టు పేర్కొంది. దీంతో కోర్టు కంగనాకు అరెస్ట్ నుంచి మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!