పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు ఏడాది కాలంగా ప్రజలు నిరసన వ్యక్తం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి మోడీ నిన్న ప్రకటించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగబద్ధంగా రద్దు ప్రక్రియను పూర్తి చేయనుంది. మోడీ తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కంగనా మాత్రం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సిగ్గు చేటు, పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఫైర్ అయ్యింది కంగనా.
Read Also : “తలపతి 66” స్టోరీ లైన్ ఇదే ?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కంగనా ‘ఇది విచారకరం, సిగ్గుచేటు, తప్పు’ అని రాసింది… “ఎంచుకున్న ప్రభుత్వం పార్లమెంటులో కూర్చుంటే, వీధుల్లో కూర్చున్న వారు చట్టాలు చేయడం ప్రారంభిస్తే ఇది కూడా జిహాదీ దేశమే… అభినందనలు ఇది చేస్తునం వారందరికీ” అంటూ ఘాటు పోస్ట్ చేసింది. అంతేకాదు ఆనంద్ రంగనాథన్ ట్వీట్‌ను కంగనా తన కథనంలో పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. “ఆశ్చర్యకరంగా ఇది పిరికిపంద చర్య… దేశ ప్రగతికి పరాజయం. ప్రతిపక్షాల మాదిరిగానే నరేంద్ర మోదీ కూడా దేశాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నారు. భారత్ ఓడిపోయింది. అరాచకం విజయం సాధిస్తుంది. గడ్డు రోజులు వస్తున్నాయి” అంటూ ఆ పోస్టులో ఉంది.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. “నేనేం చేసినా రైతుల కోసమే చేశాను.. నేను చేసేది దేశం కోసమే.. మీ ఆశీర్వాదంతో నా కష్టాన్ని ఏనాడూ వదలలేదు.. ఈ రోజు నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇప్పుడు మరింత కష్టపడి పని చేస్తాను. తద్వారా మీ కలలు, దేశం కలలు సాకారమవుతాయి. మేము మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో ప్రక్రియను ప్రారంభిస్తాము” అని ప్రధాని మోదీ చెప్పారు.

తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!