Emergency: ఇందిరా గాంధీ గా ఒదిగిపోయిన ఫైర్ బ్రాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసినా సంచలనమే. రియల్ గానే కాకుండా రీల్ లోనూ ఆమె ప్రయోగాలకు పెట్టింది పేరు. నువ్వు ఇది చేయలేవు అని చెప్తే.. దాన్ని చేసి చూపించేస్తుంది. ఇక బయోపిక్ ల విషయంలో అయితే అమ్మడిని ఆపడం ఎవరి తరం కాదు. మణికర్ణిక, తలైవి చిత్రాలలో కంగనా నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఇక తాజాగా కంగనా మరో బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, దర్శకత్వం కంగనానే అందివ్వడం విశేషం.
1975 లో జరిగిన యదార్ధ ఘటన గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందిరా గాంధీగా కంగనా మక్కీకి మక్కి దింపేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా ఆమె లుక్ ఆకట్టుకొంటున్నాయి. హెయిర్ దగ్గర నుంచి హావభావాలు, వాయిస్ వరకు అన్నింటిని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక చివర్లో ఇందిరాను అందరు మేడమ్ అని కాదు సర్ అని పిలుస్తారని అమెరికా అధ్యక్షుడు కి తెలుసా..? అని కంగనా చెప్పిన డైలాగ్ ఇందిరా గాంధీ ఎంతటి పవర్ ఫుల్ లేడీనో తెలిసేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్..శ్రేయాస్ తల్పాడే..భూమికా ఛావ్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Also Read
- Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
- Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
- Mohan Babu: "ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు.." మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!