NTV Telugu Site icon

Indian2 Bookings: స్లో స్టార్ట్ చేసిన కమల్ “ఇండియన్ 2”

Indian 22

Indian 22

Indian2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు. కల్కి 2898ఏడీ తర్వాత సౌత్ నుంచి రాబోతున్న మరో పెద్ద సినిమా “ఇండియన్ 2”. యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 300+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. . ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ పై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Also Read: Jilebi On Aha: ఆహాలో వచ్చేస్తున్నా జిలేబి

అయితే ఆరంభంలో బడ్జెట్ కారణాల వలన కొంతకాలం వాయిదా పడింది. ఆ కూడా తరువాత వేర్వేరు ఇష్యూలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి సుదీర్ఘ కాలం పట్టింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ చేసారు. తమిళనాట 1150 థియేటర్స్ లో మూవీ రిలీజ్ కానుండగా ఇప్పటి వరకు 30% అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంట. అలానే తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ సూపర్ హిట్‌ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో భారతీయుడు 2 చాలా స్లో బుకింగ్ జరుగుతున్నాయట. ఇక ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే శంకర్, కమల్ హాసన్ తో పాటు ప్రేక్షకులు మౌత్‌ టాక్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే.

Show comments