Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kamal Haasans Movie With Cm S Son

Udhayanidhi Stalin: సీఎం కొడుకుతో కమల్ హాసన్ సినిమా!

Published Date :July 26, 2022 , 5:07 pm
By Subbarao N
Udhayanidhi Stalin: సీఎం కొడుకుతో కమల్ హాసన్ సినిమా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kamal Haasan’s movie with CM’s son!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కరుణానిధి మనవడు, ప్రస్తుత సీ. ఎం. స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఎమ్మెల్యేగా ఉన్నారు. విశేషం ఏమంటే తాతయ్య కరుణానిధి అడుగు జాడల్లో నడుస్తూ చిత్రసీమలో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు ఉదయనిధి. అంతేకాదు… రెడ్ జయింట్ మూవీస్ పేరుతో సినిమా నిర్మాణంతో పాటు పంపిణీ రంగంలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అతను డీఎంకే పార్టీకి చెందిన వాడైనా సినిమా రంగం విషయానికి వచ్చే సరికీ ఉదయనిధి రాజకీయాలను దూరంగానే పెడుతుంటాడు. బీజేపీకి చెందిన ఖుష్బూ భర్త సుందర్ డైరెక్ట్ చేసిన సినిమాలను పంపిణీ చేయడానికి ఉదయనిధి వెనుకాడడు. అలానే కమల్ హాసన్ కు తమిళనాడులో సొంతంగా ఓ పార్టీ ఉంది. అది డీఎంకేతో గత ఎన్నికల్లో ఢీ కొట్టింది. అయినా కమల్ తాజా చిత్రం ‘విక్రమ్’ను ఉదయనిధి స్టాలినే తన రెడ్ జయింట్ మూవీస్ ద్వారా విడుదల చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కమల్ పాత అప్పులన్నీ తీరిపోయాయని అంటున్నారు. ఇదిలా ఉంటే… సోమవారం రాత్రి చెన్నయ్ లో రెడ్ జయింట్ మూవీస్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమల్ హాసన్… తన రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లో తీయబోతున్న 54వ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తాడని ప్రకటించారు. గతంలో కమల్ హాసన్ తో ఉదయనిధి స్టాలిన్ ‘మన్మధన్ అంబు’ మూవీని నిర్మించాడు. అది తెలుగులో ‘మన్మథ బాణం’గా డబ్ అయ్యింది. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ఉదయనిధి హీరోగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో సినిమా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Grandson of Karunanidhi
  • Kamal Hassan
  • Raaj Kamal Films International
  • Red Giant Movies
  • Udhayanidhi Stalin

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..

  • Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..

  • Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

  • Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?

  • Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions