NTV Telugu Site icon

Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…

Indian 2

Indian 2

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా, సేనాపతి క్యారెక్టర్ కి కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ మొదలుపెట్టాడు. తైవాన్ లో ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే తైవాన్ లో ఇండియన్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అనివార్య కారణల వలన డిలే అవుతూ వచ్చిన ఇండియన్ 2 షూటింగ్ గత అయిదేళ్లుగా జరుగుతూ వస్తోంది. మధ్యలో కొన్ని నెలల పాటు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. జూన్ నాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న శంకర్, అందుకు తగ్గట్లుగా షూటింగ్ పార్ట్ ని ప్లాన్ చేస్తున్నాడు. తైవాన్ లో వారం రోజుల పాటు ఒక షెడ్యూల్ చేసి, నెక్స్ట్ షెడ్యూల్ లో ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

25 రోజుల పాటు ఒక ట్రైన్ లో హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చెయ్యనున్నాడు. ఇండియన్ 2 సినిమాకే హైలైట్ గా ఉండనున్న ఈ ఎపిసోడ్ ని 25 రోజుల పాటు షూట్ చేస్తున్నాడు అంటేనే శంకర్ ఇండియన్ 2 విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన ఐకానిక్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ‘సేనాపతి’ ఈసారి మర్మకళతో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాడు? ఎవరితో ఫైట్ చెయ్యబోతున్నాడు? అసలు సేనాపతి కంప్లీట్ బ్యాక్ స్టొరీ ఏంటి అనేది ఇండియన్ 2 సినిమాలో చూడాల్సిందే. నవంబర్ నెలలో ఇండియన్ 2 సినిమా రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ నవంబర్ మిస్ అయితే ఇండియన్ 2 సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Show comments