Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 3: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 1996 మే 9న థియేటర్లలో విడుదలైన భారతీయుడు (Bharateeyudu) ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ‘ఇండియన్ 2’ 2024 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో సీక్వెల్ కి స్పందన రాలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ‘ఇండియన్ 3’ కూడా ఇకపై ఉండకపోవచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
వాస్తవానికి ‘ఇండియన్ 2’తో పాటే ‘ఇండియన్ 3’లోని చాలా సన్నివేశాలను కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడో భాగానికి కేవలం కొన్ని ప్యాచ్‌వర్క్ సీన్లు, ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ వచ్చిన రూమర్లను పక్కనపెట్టి, దీనిని థియేటర్లలోనే భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ పనులు అత్యంత భారీ స్థాయిలో ఉండటంతో, ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఈ గ్రాఫిక్స్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడవ భాగం పూర్తిగా సేనాపతి ఫ్లాష్‌బ్యాక్ పాత్ర అయిన ‘వీరశేఖరన్ బలరామన్’ చుట్టూ తిరగనుంది. ఇందులో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్, సేనాపతి పూర్వీకుల కథను, యుద్ధ సన్నివేశాలతో కలిపి ఎమోషనల్ గా చూపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు కూడా ముగింపు దశకు వస్తుండటంతో, రాబోయే కొన్ని వారాల్లోనే టీజర్, గ్లింబ్స్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు అయితే తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
Also Read
దర్శకుడు శంకర్‌కు కూడా ‘ఇండియన్ 3’ కీలకమైన సినిమాగా మారే అవకాశం ఉంది. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్’ ఫ్రాంచైజీని మళ్లీ ముందుకు తీసుకెళ్లే అవకాశం రావడం ప్రత్యేకంగా మారింది. అయితే ‘ఇండియన్ 3’ కి సంబంధించి ఇప్పటివరకు ఆఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం అంతా పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్నదే. ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తయి ఉండటంతో, నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా మిగిలిన పనులు పూర్తి చేసి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి సేనాపతిగా కమల్ హాసన్ ‘ఇండియన్ 3’తో ఈ ఫ్రాంచైజీకి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!