NTV Telugu Site icon

Kamal Haasan: హెలికాప్టర్ నే ఎత్తి అవతల వేసేలా ఉన్నాడు…

Kamal Haasan

Kamal Haasan

68 సంవత్సరాల వయసులో కూడా 500 కోట్లు రాబట్టిన యాక్షన్ సినిమాలో హీరోగా నటించగలడు నిరూపించిన హీరో ‘కమల్ హాసన్’. లోకనాయకుడిగా ఎలాంటి పాత్రలో అయినా నటించగల కమల్ ‘విక్రమ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఏజెంట్ విక్రమ్ గా కమల్ టెర్రిఫిక్ గా కనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కమల్ హాసన్ ‘మెషిన్ గన్’ని లాక్కొచ్చే సీన్ లో ఆయన ఫిట్నెస్ చూస్తే, ఈ ఏజ్ లో కూడా అలా ఎలా ఉన్నాడు రా బాబు అనిపించకమానదు. సరిగ్గా అలాంటి ఫీలింగ్ నే ఇస్తూ కమల్ హాసన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Kamal Haasan: విదేశీ భామలతో కమల్ మదన కామరాజు లీలలు..

కమల్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో ‘ఇండియన్ 2’ ( #indian2 ) సినిమా చేస్తున్నాడు. ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కోసం కమల్ రోజూ హెలికాప్టర్ లో చెన్నైకి షూటింగ్ స్పాట్ కి చెక్కర్లు కొడుతున్నాడు. అలానే ఈరోజు హెలికాప్టర్ లో సెట్స్ కి వచ్చిన కమల్ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. దీంతో ఫోటోల్లో హెలికాప్టర్ పక్కన నిలబడి ఉన్న కమల్ హాసన్ ని చూడగానే “ఆయన హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తున్నట్లు లేదు, ఆ హెలికాప్టర్ నే ఎత్తి అవతల వేసేలా ఉన్నాడు…” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కమల్ షోల్డర్స్, ట్రైసెప్స్ చూస్తే కమల్ హాసన్ ఫిట్నెస్ రేంజ్ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.