NTV Telugu Site icon

Kalyan Ram: తారక్, నేను.. TDP గురించి ఆలోచించే టైం ఇప్పుడు లేదు!

Kalyan Ram Speech

Kalyan Ram Speech

Kalyanram comments about supporting TDP for 2024 Elections: నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సినిమా గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ నామా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ముందుగా ఒక ఇంటర్వ్యూలో 2024 ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అని ప్రశ్నించినప్పుడు.. కళ్యాణ్ రామ్ దీర్ఘంగా కాసేపు అలోచించి ఫ్యామిలీగా నేను, ఎన్టీఆర్ కలసి నిర్ణయం తీసుకుంటాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా వేరు రాజకీయం వేరు. కాబట్టి ఫ్యామిలీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని, మా ఫ్యామిలిలో నేను, తారక్ కలిసి నిర్ణయం తీసుకోవాలి అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

Captain Miller: శివన్నతో ధనుష్ ఆటాపాటా.. భలే ఉందిగా

సినిమా వేరు, రాజకీయం వేరు. పాలిటిక్స్ అనేది ఒక బాల్ గేమ్ లాంటిది, దానిలో కేవలం కళ్యాణ్ రామ్ ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు ఇది ఒక ఫ్యామిలీ విషయం అని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక కుటుంబంగా కలిసే తీసుకుంటాము, ఎటు ఎలా ప్రయాణించాలన్నా కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత అటువైపుగా వెళ్తాము” అని బదులిచ్చారు. ఇక ఇప్పుడు ఎన్ టీవీ ఇంటర్వ్యూలో ఆయనను 2024 ఎన్నికల్లో మీరు లేదా తారక్ ప్రమేయం ఏమైనా ఉంటుందా? అని అడిగితే దానికి ఆయన మాట్లాడుతూ ఇప్పటికప్పుడు మీరు అడిగితే లేదనే చెబుతాను, ఎందుకంటే ఈ క్షణంలో మా మైండ్ అసలు పక్కకి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము చేస్తున్న దేవర సినిమా వద్దే మా సమయం, మైండ్ అన్నీ ఇరుక్కుపోయాయి. అందరూ దేవర సినిమా గురించి అడుగుతూ ఉండడంతో ఆ ప్రెజర్ మా మీద ఎక్కువగా ఉంది. దాని మీద ఉన్న ఏకాగ్రత ప్రస్తుతానికి ఎటూ పోకుండా చూసుకుంటున్నాం. అయితే ఒక కుటుంబంగా కూర్చుని మాట్లాడాలి, అయితే ఇంకా మేము ఆ స్పేస్ తీసుకోలేదు అని కళ్యాణ్ రామ్ అన్నారు. అయితే ఒకసారి ఆ స్పేస్ లోకి వెళితే అందరికంటే ముందు మీకే చెబుతాం అని అన్నారు.