Site icon NTV Telugu

డిసెంబర్ రేస్ లో కళ్యాణ్ రామ్ “బింబిసార”

Kalyan Ram Bimbisara Movie to be a trilogy

నటుడు, నిర్మాత నందమయూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. అయితే ఖచ్చితమైన విడుదల తేదీ రెండు వారాల్లో రివీల్ చేస్తారని అంటున్నారు. డిసెంబర్ మొదటి వారం అంటే 2వ తేదీన బాలకృష్ణ ‘అఖండ’, డిసెంబర్ మధ్యలో ‘పుష్ప’ (డిసెంబర్ 17), ఆ తర్వాత డిసెంబర్ 24న వరుణ్ తేజ్ ‘గని’, నాని ‘శ్యామ్ సింగరాయ్’ ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో “బింబిసార” కూడా రేసులో చేరుతుంది అంటూ వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

Read Also : భారీ ధరకు అమ్ముడైన “పుష్ప” శాటిలైట్ రైట్స్

బింబిసార చిత్రానికి నూతన దర్శకుడు మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయిక. చిరంతన్ భట్ సౌండ్‌ట్రాక్ స్కోర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

Exit mobile version