భారీ ధరకు అమ్ముడైన “పుష్ప” శాటిలైట్ రైట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” విడుదలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. రష్మిక ఆయనతో మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ లో అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పాటలు హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ‘పుష్ప’ ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊపందుకున్నాయి. ఈ యాక్షన్ డ్రామా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తాజా సమాచారం.

Read Also : ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ ఎవరికంటే…

తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 6.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మలయాళ రైట్స్ ను ఏషియా నెట్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ‘పుష్ప’ను విడుదల చేయనున్న అన్ని భాషల్లో శాటిలైట్ డీల్ ముగిసింది. ఇక ఇప్పటికే హిందీ వెర్షన్ రిలీజ్ సమస్య కూడా తీరిపోయింది. ‘పుష్ప’ను హిందీ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లలో విడుదల చేయడానికి అంగీకరించారు. డిసెంబర్ 17న ‘పుష్ప’ను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు చాలా ఆతృతగా ఉన్నారు.

Related Articles

Latest Articles