Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?

Nkr

Nkr

నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకీతో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తాజాగా మరొక క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు పరశురామ్, ఇటీవల కళ్యాణ్ రామ్‌ను కలసి ఒక ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది.

పరశురామ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా ఈ కథను సిద్ధం చేశారని సమాచారం. కథ వినిపించిన విధానం మరియు నరేషన్ కళ్యాణ్ రామ్‌కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. స్టోరీలో చిన్న చిన్న కరెక్షన్ చెప్పారట కళ్యాణ్ రామ్. స్క్రిప్ట్ మరోసారి రీవర్క్ చేసి మరో నేరేషన్ ఇచ్చాక ఫైనల్ కాల్ తీసుకుంటరని సమాచారం. ఒకవేళ అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. కథ, డేట్స్ మరియు కాస్టింగ్ అన్ని అనుకూలంగా కుదిరితే, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.