NTV Telugu Site icon

Kalki 2898 AD: కాన్సర్ట్ లో కల్కి గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్…

Kalki 2898ad

Kalki 2898ad

ప్రభాస్… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD. మే 9న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మచ్ అవైటెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకు చూడని ఫ్యూచరిస్టిక్ సినిమాని నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. ఇండియన్ మైథాలజీకి మోడరన్ టచ్ ఇచ్చి కల్కిని రూపొందిస్తున్న నాగి… కల్కి కోసం చాలా మంది స్టార్స్ ని దించాడు. ఇప్పటికే పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అయ్యి పార్ట్ 2 పనులు జరుపుకుంటున్న కల్కి సినిమాకి చెన్నై సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కల్కి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్… చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియమ్ లో ‘నీయే ఓలి’ అనే కాన్సర్ట్ చేసాడు.

ఈ కాన్సర్ట్ లో సంతోష్ నారాయణన్ ‘కల్కి 2898 AD’ గ్లింప్స్ థీమ్ మ్యూజిక్ ని ప్లే చేసాడు. రెండు నిమిషాల నిడివి గల ఈ థీమ్ ని కాన్సర్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు సూపర్ గా రెస్పాండ్ అయ్యారు. కాన్సర్ట్ మొత్తం ఒక్కసారిగా కల్కి థీమ్ తో వైబ్రేట్ అయ్యింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంతోష్ నారాయణ్ మ్యూజికల్ కాన్సర్ట్ నుంచి ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కల్కి అప్డేట్ ని చెప్పండి అంటూ వైజయంతి మూవీస్ ని టాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. మరి నాగ్ అశ్విన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం, సినీ అభిమానుల కోసం స్పెషల్ అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందేమో చూడాలి.

Show comments