Kaliyugam Pattanamlo to Release In February: న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ కొత్త మేకింగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే మునుపెన్నడూ లేని విధంగా కొత్త దర్శకులు స్క్రీన్ మీద వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలు ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ కొత్త కథాంశంతోనే ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమా రాబోతోంది. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమా తెరకెక్కగా అందులో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
తొలి ప్రయత్నంగా ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రమాకాంత్ రెడ్డి ప్రయోగం చేశారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా బాగా రావడంతో చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని యూనిట్ ప్రకటించింది. ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించగా చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నామని మేకర్స్ ప్రకటించారు.