Kali Trailer: ఇంట్రెస్టింగ్ గా నరేష్ అగస్త్య “కలి” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kali Movie Trailer: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ “కలి” మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్లే ఇబ్బందులు పడుతుంటాడు. ‘నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ’ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్.
Iran: హిజ్బుల్లా కమాండర్లని చంపితే ఓటమి కాదు..ఇజ్రాయిల్‌పై ఇరాన్ వ్యాఖ్యలు…
Also Read
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
- Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా 'గోల్డ్ స్పాట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
- Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరాం జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రియదర్శి వాయిస్ ఓవర్ నవ్వించింది. ‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే…’ అనే డైలాగ్ “కలి” కథలోని సోల్ ను చెప్పింది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి “కలి” సినిమా థ్రిల్లింగ్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
-
Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!