NTV Telugu Site icon

Ram Charan: చరణ్- ఉపాసన బిడ్డకు జోలపాట.. గిఫ్ట్ ఇచ్చిన కీరవాణి కొడుకు

Charan

Charan

Ram Charan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. రేపే ఎదురుకాబోతుంది. పదకొండేళ్ల నిరీక్షణ మరో 24 గంటల్లో ఫలించనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారే క్షణాలు దగ్గరపడ్డాయి. దీంతో మెగా కుటుంబంతో పాటు.. మెగా అభిమానులు సైతం రేపటి ఉదయం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక బిడ్డ కోసం రామ్ చరణ్ దంపతులు ఇప్పటికే ఎన్నో గిఫ్ట్ లను రెడీ గా ఉంచారు. ఉపాసన.. బిడ్డ సంరక్షణ కోసం అత్తమామలు అయిన చిరు- సురేఖ ఇంటికి మకాం మారుస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంకోపక్క చరణ్ సైతం.. పుట్టినబిడ్డతోనే ఎక్కువ సమయం గడపడానికి షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇచ్చి.. తన వారసుడు/ వారసురాలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక మెగా కుటుంబం అయితే సంబురాలు చేయడానికి సిద్ధమైంది. చరణ్ స్నేహితులు సైతం ఇప్పటినుంచే బిడ్డకు గిఫ్ట్ లు ఇవ్వడం మొదలుపెట్టారు.

Raviteja: లీల పాపను వదలనంటున్న మాస్ మహారాజా..?

తాజాగా పుట్టబోయే మెగా బేబీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ స్పెషల్ గిఫ్ట్ ను అందించాడు. చిన్నారి చక్కగా నిద్రపోవడానికి ఒక జోలపాట ట్యూన్ ను స్వయంగా తాం స్వహస్తాలతో రికార్డ్ చేసి.. చరణ్- ఉపాసన దంపతులకు అందించాడు. అయితే ఈ జోల పాట కేవలం చరణ్- ఉపాసన బిడ్డకు మాత్రమే కాదని, గ్లోబల్ గా ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లల కోసం వాడుకోవచ్చని కూడా తెలిపాడు. ఇక ఈ ట్యూన్ ను చరణ్- ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. కాలభైరవకు థాంక్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.