NTV Telugu Site icon

Anil Ravipudi: ఇరువురి భామల మధ్య బాలయ్య పాటతో నలిగావా.. మావా

Anil

Anil

Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కు జంధ్యాల అని పేరు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. నేడు కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా సెట్ లో జరిగిన ఒక ఫన్నీ వీడియోను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. గతంలో అనిల్ రావిపూడి.. బాలయ్య సాంగ్ కు చిందేసిన విషయం తెల్సిందే. బాలయ్య.. బాలయ్య.. గుండెల్లో గోలయ్య సాంగ్ కు అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ తో కలిసి చిందేశాడు. ఇక దానికి రివెంజ్ గా అనిల్ ముందే.. కాజల్, శ్రీలీల.. బాలయ్య మరో సాంగ్ కు చిందేసి అనిల్ కు షాక్ ఇచ్చారు.

NTR: ‘దేవర’ కోసం ఆ రిస్క్ చేయబోతున్న ఎన్టీఆర్..?

నరసింహానాయుడు చిత్రంలోని చిలకపచ్చ కోక సాంగ్ లోని రెండు లైన్లకు శ్రీలీల, కాజల్ బాలయ్య స్టెప్స్ తో అదరగొట్టేశారు. రారా ఉల్లాస వీరుడా.. నీ సోకుమాడ.. నీదే నా పట్టుపావడా అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక మధ్యలో అనిల్ వచ్చి సూపర్ అని చెప్పినా.. ఇంకా మాది అవ్వలేదు అంటూ మిగతా మ్యూజిక్ కు కూడా ఈ ముద్దుగుమ్మలు చిందేసి అనిల్ రావిపూడికి తమ సత్తా చూపించారు. ఇక ఇందులో మరొక విషయమేంటంటే.. ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే కలర్ డ్రెస్స్ ల్లో కనిపించి ఔరా అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇరువురి భామల మధ్య బాలయ్య పాటతో నలిగావా.. మావా అంటూ అనిల్ ను ఆటపట్టిస్తున్నారు. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి- బాలయ్య కాంబో ఎలాంటి హిట్ ను అందుకోనున్నదో చూడాలి.