NTV Telugu Site icon

Satyabhama: కాజల్ సినిమా డైరెక్టర్ మిస్సింగ్!

Kajal Aggerwal Satyabhama Director Changed

Kajal Aggerwal Satyabhama Director Changed

Kajal Aggerwal’s Satyabhama Director changed: షూటింగ్ మధ్యలో దర్శకులను మార్చడం తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఈమధ్య కాలంలో అయితే సిద్దు జొన్నలగడ్డ నటించిన “టిల్లు స్క్వేర్”తో ఇది మొదలైంది. ఇక ఆ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ థ్రిల్లర్ “డెవిల్” విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. సినిమా ఓపెనింగ్ సమయంలో ఉన్న నవీన్ మేడారం అనే దర్శకుడిని తొలగించిన తర్వాత నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించారు. తన పేరును దర్శక నిర్మాతగా వేసుకోవడంతో పెద్ద చర్చ జరిగినా ఆయన వెనక్కు తగ్గకుండా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గ “సత్యభామ” అనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా నటిస్తోంది. సినిమా అనౌన్స్ చేయగానే దర్శకుడిగా అఖిల్ డేగల వ్యవహరిస్తాడు అని అధికారికంగా ప్రకటించారు.

Japan: టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్.. యూట్యూబ్ లో కుమ్మేస్తోంది

ఈ సినిమాకి ఆయనే రచయిత అని దర్శకుడిగా కూడా ఆయనే వ్యవహరిస్తాడని కూడా వెల్లడించారు. ఈ మేరకు జూన్‌లో కాజల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే దీపావళి సందర్భంగా మరో టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇలా విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేయగా అందులో ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే దర్శకుడి పేరును మార్చేశారు. అఖిల్ డేగల అని ఉండాల్సిన పేరును సుమన్ చిక్కాలగా మార్చారు. అంటే అఖిల్ దేగల స్థానంలో సుమన్ డైరెక్టర్ కం రైటర్ గా బాధ్యతలు స్వీకరించాడు అన్నమాట. ‘మేజర్’, గూఢచారి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్క ‘సత్యభామ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ దర్శకుడి మార్పులో శశి కిరణ్ తిక్క ప్రమేయం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.