NTV Telugu Site icon

Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్

Kajal

Kajal

Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహామాడిన కాజల్.. ఏడాది లోపే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో కాజల్ ఇక సినిమాలు చేయదు అని వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఏది నిజం కాదని కాజల్ వరుస లైనప్ ను చూస్తేనే తెలుస్తోంది. ఇప్పటికే కాజల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 లో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న కాజల్.. భగవంత్ కేసరిలో బాలయ్య సరసన నటిస్తోంది. ఇంకోపక్క తమిళ్ లో సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. అంతేకాకుండా కార్తీక అనే సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ఇందులో కాజల్ దెయ్యంగా భయపెట్టింది. తాజగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. తన వ్యక్తిగత విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తన భర్త గౌతమ్ అంటే.. తన తండ్రికి ఇష్టం లేదని తెలిపి షాక్ ఇచ్చింది.

Suriya- Jyothika: సూర్య- జ్యోతిక కూతురును చూశారా.. హీరోయిన్ కూడా సరిపోదు

” గౌతమ్, నేను మంచి స్నేహితులం. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు. మా ఫ్రెండ్షిప్ ఏడేళ్లు కొనసాగింది. ఈ ఏడేళ్లలో అతని వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నాకు నేను ఏరోజు అతనికి చెప్పలేదు. అతనికి కూడా నేను అంటే ఇష్టం అంట. తను కూడా చెప్పలేదు. ఇక ఈ మూగప్రేమ కొనసాగుతున్న సమయంలో కరోనా వచ్చింది. ఆ సమయంలో మేము ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయాం. అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో విషయం చెబితే అమ్మ వెంటనే ఒప్పుకుంది. నాన్న ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని షాక్ ఇచ్చారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. మా ఇద్దరు వృత్తులు వేర్వేరు కావడంతోన ఆయన అడ్డు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఎంతో సహాయం చేసింది. నాన్నను నిదానంగా ఒప్పించింది. ఇక ఇప్పుడు.. నాకన్నా గౌతమ్ తోనే నాన్న ఎక్కువ ఉంటున్నారు. కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వారి బాండింగ్ ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.