Site icon NTV Telugu

Kajal Aggarwal: తొలిసారి కొడుకును చూపించిన కాజల్.. ఫోటో వైరల్

Kajal

Kajal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న విషయం విదితమే.. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటూ మురిసిపోతుంది. నిత్యం కొడుకుతో చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొడుకు ఫోటోను మాత్రం అభిమానులకు చూపించలేదు.. ఇక తాజాగా కొడుకు నీల్ ఫోటోను కాజల్ షేర్ చేసింది. అయితే ఈసారి నీల్ తన చేతిని అడ్డుపెట్టడంతో ఈసారి కూడా నీల్ ముఖం కనిపించలేదు.. అయితే కాజల్ పడుకొని తన చేతిలో కొడుకును ఎత్తుకొని ప్రేమతో చూస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక కాజల్ కూడా ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపిస్తుంది. “నీల్ కిచ్లూ.. నా జీవితానికి దొరికిన ప్రేమ..గుండెచప్పుడు” అంటూ తల్లి ప్రేమను అంతే మధురంగా చెప్పుకొచ్చింది. ఇక దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తల్లీకొడుకుల ప్రేమకు ముగ్దులైపోతున్నారు. సూపర్.. మీరు ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం కాజల్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గర్భవతి గా ఉన్నప్పుడు కొద్దిగా బరువు పెరిగిన చందమామ.. ఇప్పుడు బరుడు తగ్గినట్లు కనిపిస్తోంది. మరి కాజల్ రీ ఎంట్రీ ఏ స్టార్ హీరో సినిమాతో ఇస్తుందో చూడాలి.

Exit mobile version