Site icon NTV Telugu

మరో మైలు రాయిని దాటిన కాజల్ అగర్వాల్

Kajal

Kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు పెళ్ళైనప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఇంతకుముందుకన్నా ఇప్పుడే కాజల్ అగర్వాల్ గ్లామర్ యాంగిల్ ను ఎక్కువగా చూపిస్తోంది. ఇటీవల ఆమె గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కాజల్ కూడా ఇప్పటికే వదులుకున్న సినిమాలను వదులుకుంటోంది. అయితే ప్రెగ్నన్సీ వార్తలపై మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. తరచుగా తన భర్త గౌతమ్ కిచ్లుతో అడోరబుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆమె పుట్టుకతో నార్త్ ఇండియన్ అయినప్పటికీ దక్షిణాది సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది.

Read Also : ‘పెద్దన్న’ టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చిరంజీవి నటించిన సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా ‘ఆచార్య’లో హీరోయిన్ గా కనిపించబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version