Site icon NTV Telugu

Kajal Aggarwal : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

Kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ హింట్‌ ఇచ్చారు. ‘‘స్పెషల్‌ న్యూస్‌ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు కొత్తగా తల్లిదండ్రులైన కాజల్, గౌతమ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Also : Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !

కాగా కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30న స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. కాజల్ పెళ్లి తర్వాత గర్భం దాల్చే వరకు సినిమాల్లో నటించింది. కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తల్లి కాబోతున్న విషయంతో పాటు బేబీ షవర్, బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు కాజల్. ఇక తల్లైన కాజల్ కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version