అనుకున్నంతా అయ్యింది! సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాలీ’ టైటిల్ ను మార్చబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. మధ్యలో దీనికి ‘భాయీజాన్’ అనే పేరు పెట్టారనే వార్తలూ సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే… తాజాగా సల్మాన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ సినిమాకు ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే పేరు పెట్టినట్టు తెలిపాడు. అంతేకాదు… లాంగ్ హెయిర్ తో తనదైన స్టైల్ లో ఫోజులిస్తూ, ఓ వీడియోనూ ఈ కొత్త టైటిల్ తో పాటు పోస్ట్ చేశాడు. ఫర్హద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ సైతం కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను షెహనాజ్ గిల్, జెస్సీ గిల్, జగపతిబాబు, సిద్థార్థ్ నిగమ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 26తో నటుడిగా 34 సంవత్సరాల కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగానూ సల్మాన్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
మహేశ్ మంజ్రేకర్ ‘అంతిమ్’ మూవీలో చివరగా కనిపించిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’తో పాటు ‘బజరంగీ భాయీజాన్, టైగర్ -3, కిక్ -2’ చిత్రాలు కమిట్ అయ్యి ఉన్నాడు. అయితే ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మాత్రం ఇదే యేడాది చివరిలో జనం ముందుకు రాబోతోంది.
#KisiKaBhaiKisiKiJaan@VenkyMama @hegdepooja @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii @farhad_samji @ShamiraahN @RaviBasrur @SKFilmsOfficial pic.twitter.com/odwrPWmlXN
— Salman Khan (@BeingSalmanKhan) September 5, 2022