Site icon NTV Telugu

K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..

K Ramp

K Ramp

K-RAMP Teaser : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న K ర్యాంప్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ మొత్తం బూతులు, లిప్ కిస్ లతో నింపేశారు. హీరో ఎంట్రీ సీన్ లోనే నా ల..వడలో గేమ్ ఆడురా అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత కాలేజీలో ఓ సీన్ లో.. నా వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి సార్ అని కిర్‌ణ్ అంటాడు. వెంటనే కిరణ్‌ తండ్రి పాత్ర చేస్తున్న సాయికుమార్.. నాది కూడా సేమ్ ఫీలింగ్ సార్ అంటాడు. అక్కడ బీజీఎం ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఆ తర్వాత హీరోయిన్ తో సీన్లను కొన్ని వదిలారు. హీరోయిన్ తో కిరణ్‌ అబ్బవరం లిప్ లాక్ లతో ఇందులో రెచ్చిపోయాడు. అవి బాగానే టీజర్ లో చూపించారు.

Read Also : Prabhas : దీపిక గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే అంతా షాక్..

లోపల అమ్మాయితో లిప్ కిస్సులు బాగానే జరిగినట్టున్నాయి అని వెన్నెల కిషోర్ అడగ్గా.. ఒరేయ్ ముద్దు పెడితే ఓ చోట ఫీలింగ్స్ వస్తాయి కదా.. అవి వణుకుతున్నాయ్ రా అని కిరణ్‌ చెప్పడం పీక్స్ అనే చెప్పాలి. ఇక చివర్లో హెవీ ఎంటర్ టైనింగ్ లోడింగూ అంటూ మూవీ రిలీజ్ డేట్ ను వేశారు. మూవీని అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. కాలేజీ కుర్రాడి బ్యాక్ డ్రాప్ లో మూవీ వస్తోంది. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేనంతగా హీరోయిన్ తో రొమాన్స్, బోల్డ్ డైలాగులు, బూతులు ఉన్నాయి. మరి టీజర్ లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇంక ట్రైలర్ ఎన్ని ఉన్నాయో.. సినిమాలో ఏ రేంజ్ లో పెట్టేశారో అంటూ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరంకు ఈ మధ్యపెద్దగా హిట్లు లేవు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు.

Read Also : Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..

Exit mobile version