NTV Telugu Site icon

Suriya: సూర్య- జ్యోతిక కూతురిని చూశారా.. హీరోయిన్ లా ఉందే

Suriya

Suriya

Suriya: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో ఉంటారు సూర్య- జ్యోతిక. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా.. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎక్జామ్పుల్ ఈ జంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు ఉన్నారు. దియా సూర్య, దేవ్ సూర్య. దియా 10 వ తరగతిలో టాప్ గ్రేడ్స్ తెచ్చుకొని తండ్రి పేరును నిలబెట్టింది. ఇక ఈ జంట నిత్యం కెమెరా కంటికి కనిపించినా వారి పిల్లలను మాత్రం కెమెరా ముందుకు తీసుకురారు. పిల్లల ఫోటోలు తీస్తే సూర్యకు అస్సలు నచ్చదు. ఎన్నోసార్లు కెమెరా కంటి నుంచి వారి పిల్లలను తప్పించాడు.. ఇక ఎప్పుడో అకేషన్ కానీ, ఫంక్షన్స్ లో కానీ దియా, దేవ్ కెమెరా కంటికి చిక్కరు. ఇక తాజాగా జ్యోతిక.. తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Prabhas: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ కు అస్వస్థత..?

చిన్నతనంలో దియా.. సూర్య ఏ ఫంక్షన్ కు వచ్చినా తండ్రి వెనకాలే వచ్చేది.. ఇప్పుడు ఆమె ప్లస్ 2 చదువుతోంది. ఈ ఫొటోలో ఆమెను చూసిన వారందరు.. అరే దియా పాప చాలా పెద్దది అయిపోయిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జ్యోతిక తన ఇద్దరు పిల్లతో కూర్చొని ఒడిలో పప్పితో ఆడుకుంటూ కనిపించింది. ఇక సూర్య నట వారసుడు దేవ్.. అందరి చూపు దేవ్ మీదనే ఉందని చెప్పాలి. చూస్తూ ఉండగానే దేవ్ ఎదిగిపోతున్నాడు. ముందు ముందు ఈ ఇద్దరు సినిమాల్లో కనిపించే అవకాశం ఉందా..? అంటే ఉందనే చెప్పాలి. దియా డ్రీమ్స్ వేరే ఉన్నాయని, ఇండస్ట్రీ మీద తనకు అంత ఇంట్రెస్ట్ లేదని కోలీవుడ్ లో టాక్.. ఇక ఖచ్చితంగా తల్లిదండ్రుల నట వారసత్వాన్ని దేవ్ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలడు. మరి ఈ కుర్రాడు తండ్రి బాటలో నడుస్తాడో లేదో చూడాలి.

Show comments