Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ఈ జంట లవ్ స్టోరీ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించడం.. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నాకా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, జ్యోతిక మాత్రం పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చి ఒకపక్క నటిగా, నిర్మాతగా విజయాలను అందుకుంటుంది. ఇక చెన్నై నుంచి ముంబైకు మకాం మార్చిన జ్యోతిక.. అక్కడే హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. ఈ మధ్యనే సైతాన్ అనే సినిమాలో నటించ మెప్పించిన ఆమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది. ఇక సినిమాలు కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన జిమ్ వీడియోలు, సూర్య, పిల్లలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక ఈ నేపథ్యంలోనే సూర్యతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేయగా.. సూర్య అభిమాని ఒకరు ఒక కోరిక కోరింది. అదేంటంటే.. “జ్యోతిక మేడమ్.. సిల్లును ఒరు కాదల్(నువ్వు నేను ప్రేమ) సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మెన్‌కు నేను పెద్ద అభిమానిని”. దానికి జ్యోతిక రిప్లై ఇస్తూ.. ” ఉప్స్.. అలాంటివేం కుదరదు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ రిప్లై చూసి గంతేసిన ఆ అభిమాని ” ఓ మై గాడ్. మీరు నాకు రిప్లై ఇచ్చారా.. ? నాకు సూర్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు. నా పేరులో కూడా ఆయన పేరును యాడ్ చేసుకున్నా.. అయినా మీ ప్రేమ ముందు నేను ఎంత.. సూర్య ఎప్పటికీ మీ వాడే” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
