NTV Telugu Site icon

July 2023 Tollywood Releases: రంగబలి, భాగ్ సాలే, బ్రో సహా ఈ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలివే

July Tollywood Releases

July Tollywood Releases

July 2023 Tollywood Releases: జూలై నెల‌లో థియేట‌ర్లలో సందడి చేసేందుకు ప‌లువురు టాలీవుడ్ హీరోలు సిద్ధ‌మ‌వుతోన్నారు. టాలీవుడ్ హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, నాగ‌శౌర్య, ఆనంద్ దేవరకొండ మాత్రమే కాకుండా వారితో పాటు విజ‌య్ ఆంటోనీ, శివ‌కార్తికేయ‌న్ తో పాటు మ‌రికొంద‌రు తమిళ హీరోలు సైతం త‌మ సినిమాల‌తో జూలై నెల‌లో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. జూలై రిలీజ్ కానున్న తెలుగు సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి. ముందుగా నాగ‌శౌర్య హీరోగా న‌టించిన రంగ‌బ‌లి మూవీ జూలై 7న రిలీజ్ కానుంది. మొట్టమొదటి సారిగాఔట్ అండ్ ఔట్ మాస్ క‌థాంశంతో నాగ‌శౌర్య చేసిన ఈ సినిమాతో ప‌వ‌న్ బాసంశెట్టి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఇక అదే రోజున కీర‌వాణి కొడుకు శ్రీసింహాకోడూరి హీరోగా క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన భాగ్‌సాలే కూడా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. షార్ట్ ఫిలిం మేకర్ ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం హిస్తోన్న ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Shirley Setia: వింత డ్రెస్సులో షిర్లే షెటియా అందాలు.. దాచినా దాగట్లేదు!

ఇక అదే రోజున జ‌గ‌ప‌తిబాబు రుద్రంగి మూవీ కూడా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్కిన రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే ర‌సమ‌యి బాల‌కిష‌న్ నిర్మించడం బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళడంతో ఆసక్తి ఏర్పడింది. ఇక ఇవేకాక నీల‌కంఠ స‌ర్కిల్‌, మోహ‌న‌కృష్ణ గ్యాంగ్‌లీడ‌ర్‌, ఓ సాథియా సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేస్తోన్న 7:11 PM సినిమాలు విడుద‌ల‌కానున్నాయి. ఇక రెండో వారంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌ బేబీ మూవీతో ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు . సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న‌ ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుండగా సినిమాలో విరాజ్ అశ్విన్‌, వైష్ణ‌వి చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ‌కార్తికేయ‌న్ డ‌బ్బింగ్ మూవీ మ‌హావీరుడు(మహావీరన్) కూడా అదే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కానుంది.

 

అలాగే దిల్‌రాజు తెలుగులో రిలీజ్ చేస్తోన్న వాలాట్టి అనే మలయాళ డబ్బింగ్ మూవీ కూడా జూలై 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక జూలై మూడో వారంలో బిచ్చ‌గాడు -2 స‌క్సెస్ త‌ర్వాత జూలై 21న హ‌త్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజ‌య్ ఆంటోనీ. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో విజ‌య్ ఆంటోనీ డిటెక్టివ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుండగా బాలాజీ కుమార్ డైరెక్ట్ చేశాడు, ఇక అదే రోజున చైత‌న్య‌రావు, లావ‌ణ్య జంట‌గా న‌టించిన అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో కూడా జూలై 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుండగా పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా చెందు ముద్దు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన బ్రో మూవీ జూలై 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.