Jr NTR : ఎన్టీఆర్ అన్‌స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి చిత్రాల జాబితాలో మూడు భారీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రమే లైన్ లో ఉన్నాయి . ఇందులో భాగంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ ఇప్పటికే సెట్స్ పై ఉంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురానున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పార్ట్ 1 తర్వాత చాలా తక్కువ గ్యాప్ లోనే పార్ట్ 2 ని కూడా రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే ఇదొక ట్రెండ్ సెట్టర్ సంచలనం కాబోతుందని స్పష్టమవుతోంది.
ఈ ‘డ్రాగన్’ సిరీస్ తర్వాత తారక్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. తాత్కాలికంగా ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అని పిలుస్తున్న ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి పురాణ ఇతిహాస నేపథ్యంలో రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే నెట్టింట ఒక సంచలనంగా మారింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా రేస్ లోకి దూసుకొస్తూ చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్ లలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
Also Read
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ కు భారీ రేంజ్ లో గ్లోబల్ మరియు పాన్ ఇండియా మైలేజ్ ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను పూర్తిగా తిరగరాయడం ఖాయం. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ లైనప్ లో కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎన్టీఆర్ తన పూర్తి ఫోకస్ ను ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ రెండు భాగాలు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టుల పైనే పెట్టనున్నారు.
తాజావార్తలు
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!