NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!

Jr Ntr New Look

Jr NTR, Thaman, NTR-Neel, NTR Dragon movie, God of War NTR, NTR new look

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తారక్ సరికొత్త లుక్, నందమూరి అభిమానులకు ఎక్కడా లేని కిక్ ఇస్తోంది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎన్టీఆర్‌కు సంబంధించి ఒక ఫోటో ఒకటి షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో ఉన్న ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత స్టైలిష్‌గా మరియు స్లిమ్‌గా కనిపిస్తున్నారు. నోట్లో టూత్‌పిక్‌, వెట్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో నెక్స్ట్ లెవల్ స్వాగ్‌తో కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎన్టీఆర్ మేకోవర్ చూస్తే.. ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా ఉంది.

ఈ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అదే సమయంలో.. అసలు ఈ లుక్ ఏ సినిమాలోనిది? తమన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా హింట్ ఇచ్చాడా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. మే 20న ఆయన బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్-నీల్ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుంది. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ పిక్ డ్రాగన్‌కు సంబంధించిందా? లేదా? గాడ్ ఆఫ్ వార్‌లో ఇలాంటి లుక్‌లో కనిపించబోతున్నాడా? అనే టాక్ నడుస్తోంది. అయితే, ఇది AI ద్వారా రూపొందించిందేనేమో అనే సందేహాలు కూడా రాకమానదు. ఏదేమైనా.. ఎన్టీఆర్ మాస్ అండ్ అల్ట్రా స్టైలిష్ లుక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి తమన్ ఈ లుక్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.