NTV Telugu Site icon

NTR: అమెరికాలో స్పైసీ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న తారక్…

Ntr

Ntr

సూపర్ స్టార్ మహేశ్ బాబు బాటలో నడుస్తూ షూటింగ్ గ్యాప్ వచ్చిన ప్రతిసారీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేస్తున్న హీరో ‘ఎన్టీఆర్. గతంలో ఎన్టీఆర్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లే వాడు కాదు. కోవిడ్ తర్వాతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడానికి ఎక్కువగా ట్రిప్స్ వెళ్తున్నాడు. కొరటాల శివతో చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుండడం కూడా ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్స్ కి కారణం అవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ లని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఇటివలే ఫ్యామిలీతో పాటు అమెరికా ట్రిప్ కి వెళ్లాడు. జనవరి ఫస్ట్ వీక్ లో రిటర్న్ రానున్న ఎన్టీఆర్, ప్రస్తుతం అమెరికాలో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. న్యూయార్క్ సిటీలో ఉన్న ‘జునూన్’ అనే ఇండియన్ రెస్టారెంట్ లో వెళ్లిన ఎన్టీఆర్… “చప్పగా అయిపోయిన తన టెస్ట్ బడ్స్ ని ఇండియన్ స్పైసీ ఫుడ్”ని రుచి చూపిస్తూ ఆ రెస్టారెంట్ లో ఫుల్లుగా లాగించేసాడు.

Read Also: NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం

యంగ్ టైగర్ అంతటి వాడు తమ హోటల్ కి వచ్చి, తిని ఫుడ్ బాగుంది అని చెప్తే హోటల్ మానేజ్మెంట్ హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటుంది. ‘క్లౌడ్ నైన్’లో ఉన్న జునూన్ హోటల్ మానేజ్మెంట్, ఎన్టీఆర్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారక్ అమెరికా వెళ్లిన తర్వాత ఫోటోస్ కరువైన నందమూరి అభిమానులు, ‘జునూన్ హోటల్’ వాళ్లు చేసిన పోస్ట్ లో ఎన్టీఆర్ ని చూసి ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోని #JrNTR అనే ట్యాగ్ క్రియేట్ చేసి నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రమే కాదు నందమూరి తారకరామారావు దగ్గర నుంచి హరికృష్ణ, బాలకృష్ణల వరకూ అందరూ మంచి భోజన ప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. పైగా ఎన్టీఆర్ హైదరాబాదీ ధమ్ బిర్యానీని అద్భుతంగా వండుతాడు అనే విషయం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది తెలుసు. ఇక ‘ఎన్టీఆర్ 30’ విషయానికి వస్తే తారక్ అమెరికా నుంచి రిటర్న్ వచ్చే లోపు ప్రీప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు ఫిబ్రవరి నుంచి ‘ఎన్టీఆర్ 30’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.

Read Also: Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే ఎవరూ నమ్మలేదు…

Show comments