Jr NTR To Attend Bimbisara Pre Release Event: కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మక సినిమా ‘బింబిసార’ ఆగస్టు 5వ తేదీన భారీఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జులై 29వ తేదీన గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కొంతకాలం నుంచి జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమతమ సినిమాల ఈవెంట్స్‌కి కలిసే పాల్గొంటున్నారు కాబట్టి.. బింబిసార ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి కూడా తారక్ రావొచ్చని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే తారక్ ఈ ఈవెంట్‌కి వస్తున్నాడు. స్వయంగా మేకర్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తారక్, కళ్యాణ్ రామ్‌ని ఒకే వేదికపై చూడొచ్చని తెలిపారు. దీంతో.. నందమూరి ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు జరుపుకుంటున్నారు.
కాగా.. కొత్త దర్శకుడు వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్‌లు కథానాయికలుగా నటించారు. క్రీస్తుపూర్వం నాటి బింబిసారుని కథకు, నవీన కాలంలోని పరిస్థితులకు ముడిపెడుతూ ఈ చిత్రం రూపొందింది. సరైన హిట్ లేక సతమతమవుతున్న కళ్యాణ్ రామ్.. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇది మంచి విజయం సాధించడమే కాకుండా తన కెరీర్‌కి మెరుగులు దిద్దుతుందని భావిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలు, పాటలకైతే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇది చారిత్రాత్మక నేపథ్యం కావడం, దీనికి టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్‌ని ఎటాచ్ చేయడం, విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి, ఆ అంచనాలకి తగ్గట్టు ఇది ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.