NTV Telugu Site icon

NTR30: వేట మొదలుపెట్టిన తారక్.. వీడియో వైరల్

Jr Ntr Starts Ntr30 Shoot

Jr Ntr Starts Ntr30 Shoot

Jr NTR Started Shooting For NTR30: జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మార్చి 23వ తేదీన NTR30 లాంచ్ అవ్వగా.. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు.. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఒక భారీ సెట్‌లో అడుగిడిన ఎన్టీఆర్ వీడియోని కూడా ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నే ఈ వీడియోకి జత చేసి రిలీజ్ చేశారు. ఇందులో తారక్ ఫేస్‌ని చూపించలేదు. వెనుక నుంచే అతడు లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని చూపించారు. కొరటాల శివని తారక్ కలవడంతో.. ‘వస్తున్నా’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వీడియో ముగుస్తుంది.

Guna Shekar: వామ్మో.. ఆ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా

ఈ సినిమా అప్డేట్స్ కోసం ఏడాదికి పైగా అభిమానుల్ని వెయిట్ చేయించిన చిత్రబృందం.. ఇప్పుడు మాత్రం వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ని సంతోషపెడుతోంది. ముఖ్యంగా.. లాంచ్ అయినప్పటి నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్‌ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దింపుతున్నామని, షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని.. క్రేజీ విషయాల్ని బయటపెడుతోంది. ఇప్పుడు తారక్ షూట్‌లో పాల్గొన్న వీడియో షేర్ చేసి.. ఫ్యాన్స్‌కి మరింత కిక్ ఇచ్చింది యూనిట్. ఈ సినిమా మేకర్స్ పెంచిన వేగాన్ని చూస్తుంటే.. ఇకపై ప్రతీ ప్రత్యేక మూమెంట్‌లో ఫ్యాన్స్‌కి పండగలాంటి అప్డేట్స్ రావడం పక్కాగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని.. మే 20వ తేదీన టీజర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం.. ఆలోపు NTR30 మేకర్స్ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో?

Gunasekhar: ఆ ఒక్క మాట చెప్పగానే.. మోహన్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

ఇకపోతే.. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడం.. ఆర్ఆర్ఆర్‌తో తారక్ గ్లోబల్ స్టార్‌గా అవతరించడంతో.. ఈ ఎన్టీఆర్30పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందించాలన్న ఉద్దేశంతోనే.. కొరటాల చాలా సమయం తీసుకొని స్టోరీని సిద్ధం చేశాడు. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా కోసం పేరుగాంచిన టెక్నీషియన్లు పని చేస్తున్నారు.

Show comments