NTV Telugu Site icon

Jr NTR: కళ్యాణ్ అన్న కెరీర్‌లో అమిగోస్ ఓ మైల్‌స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది

Jr Ntr Speech Amigos

Jr Ntr Speech Amigos

Jr NTR Speech At Amigos Pre Release Event: ‘అమిగోస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూ. ఎన్టీఆర్.. ఈ సినిమా తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం తన అన్న చాలా కష్టపడ్డారని, ఆ కష్టం ఎలా ఉంటుందో తనకు తెలుసని, ఎందుకంటే తాను కూడా ‘జై లవ కుశ’లో ట్రిపుల్ రోల్ చేశానని తారక్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఆయన ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాడు. ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని తాను నమ్ముతున్నానని, ఆ నమ్మకాన్ని మీరు నిలబెడతారని తాను ఆశిస్తున్నానని ప్రేక్షకాభిమానుల్ని ఉద్దేశిస్తూ తెలిపాడు. తెలుగు ప్రేక్షకులు గొప్ప మనసు ఉన్న వాళ్లని, మంచి చిత్రాల్ని తప్పకుండా ఆదరిస్తారని, ఈ సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారని తాను కోరుకుంటున్నానని అన్నాడు.

Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం

అంతకుముందు.. సినిమా దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎంతో డెడికేషన్‌తో ఈ సినిమా చేశారని తారక్ కొనియాడాడు. ఇంజినీరింగ్ చేసిన ఆయన్ను ఉద్యోగం చేయమని తల్లిదండ్రులు చెప్తే.. సినిమా మీదున్న ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చారని, ఒక సినిమాను డైరెక్ట్ చేశాకే తాను ఇంటికి తిరిగొస్తానని మాటిచ్చారని తారక్ తెలిపాడు. కానీ.. షూటింగ్ మొదలయ్యేలోపు దర్శకుడి అమ్మ కాలం చేశారని, చిత్రం మొదలై ఆఖరి షెడ్యూల్‌లో వారి నాన్న తుదిశ్వాస విడిచారని తెలియజేశాడు. సినిమా పట్ల ఒక వ్యక్తికి ఇంత తాపత్రయం ఉంటుందా? అని రాజేంద్రని చూశాకే తనకు తెలిసిందన్నాడు. రాజేంద్ర కోసం ఈ సినిమా ఒక అద్భుత విజయాన్ని అందించాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. ఈ సినిమా ఆశికాకు పర్ఫెక్ట్ లాంచ్ అవుతుందని, ఇంత గొప్పగా ఈ సినిమా రావడానికి కారకులైన సాంకేతిక నిపుణులకు థాంక్స్ అని తెలిపాడు.

Bhartat Biotech : భవిష్యత్ ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్, ఎల్లా ఫౌండేషన్ మరో ముందడుగు

తమ కుటుంబంలో కళ్యాణ్ అన్నయ్యే ఎక్కువ ప్రయోగాలు చేశారని.. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ టెక్నాలజీకి పెద్ద పీట వేశారని తారక్ ప్రశంసించాడు. తన అన్న ఎందుకు ప్రయోగాలే చేస్తున్నారని, మాస్ సినిమాలు ఎప్పుడు చేస్తారని తాను అనుకునేవాడినని.. అప్పుడప్పుడు పటాస్, అతనొక్కడే వంటి సినిమాలు చేశారని.. ఫైనల్‌గా బింబిసారతో పూర్తి ఆకలి తీర్చేశారని అన్నాడు. ఇప్పుడు ఈ అమిగోస్‌తో కూడా ఆయన మంచి విజయం సాధిస్తారని తాను నమ్ముతున్నానన్నాడు. ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌కి వెళ్లడానికి కారణం.. ప్రేక్షకాభిమానుల ఆశీర్వచనంతో జక్కన్న సాధించిన విజయమని తారక్ చెప్పుకొచ్చాడు.