NTV Telugu Site icon

Devara : ఆ సీన్ చేసేప్పుడు చచ్చిపోతా అనిపించింది.. భార్య పిల్లలు గుర్తొచ్చారు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Ntr

Ntr

వారం రోజుల్లో ‘దేవ‌ర’ సంద‌డి షురూ కానున్న క్రమంలో ఎక్కడ చూసినా దేవర గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘అర‌వింద స‌మేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వ‌స్తుండ‌టంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మూవీ టీమ్. ఈక్రమంలోనే తాజాగా యంగ్ హీరోలు విష్వక్ సేన్ ,సిద్దు జొన్నల గడ్డ ఎన్టీఆర్ ను, డైరెక్టర్ కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తారక్ ను అడిగిన ప్రశ్నలకు ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దేవర సినిమా గురించి ఎన్టీఆర్ చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందు సినిమా లైన్ లీక్ చేశాడు.

Also Read: Israel: ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 140 మిస్సైల్స్ ప్రయోగం..

అలాగే ఈ సినిమా షూటింగ్ గోవాలో చేస్తున్నప్పుడు సముద్రంలో సీన్ చెయ్యాలి, పైన ఎండ చాలా వేడిగా ఉంది అప్పుడు నేను తట్టుకోలేకపోయా. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు ఆ పక్కన ఓ రూమ్ పెట్టారు దానికి ఏసీ ఉంది. నేను వెళ్ళిపోతా అని నేను ఒక్క షాట్ ఉంది అని శివ, చివరికి నేను తట్టుకోలేక, నేను పోతా చచ్చిపోయేలా ఉన్నాను అని అన్నాను..అప్పుడు నేను చచ్చిపోతాను అనుకున్నా, భార్య పిల్లలు ఒక్క క్షణం గుర్తొచ్చారు. నాజీవితం ఏంటి.? నేను చచ్చిపోతానా.? అని అనిపించింది. అలాంటప్పుడు షూట్ అయిపొయింది షాట్ ఓకే అన్నారు. అక్కడే లుంగీ తీసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రూమ్ లో డోరు మూసేశా, ఒక్క సెకన్ చల్లగా అనిపించింది. బతికాను రా అని అలా బెడ్డు మీద పడుకున్నా, అంతే హమ్మయ్య అనుకునేలోగా కరెంట్ పోయింది. ఫోన్ చేస్తే జనరేటర్ పాడైందన్నారు. ఆ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

Show comments