Jr NTR Request To Fans Over Movie Updates: తమ అభిమాన హీరోకి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిందంటే చాలు.. ఆ మరుసటి రోజు నుంచి అప్డేట్ కావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటుంటారు. ఏదైనా ఈవెంట్ వచ్చినా, హీరోల పుట్టినరోజు వేడుకలు వచ్చినా.. ఆరోజు అప్డేట్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తారు. ఒకవేళ అప్డేట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే మాత్రం.. సోషల్ మీడియాలో ఫలానా నిర్మాణ సంస్థపై ఎగబడతారు. అప్డేట్ కోసం ఇంకెంతకాలం వెయిట్ చేయాలంటూ.. ఆ బ్యానర్‌ను నిలదీయడం మొదలుపెడతారు. అప్పటికీ రెస్పాండ్ అవ్వకపోతే.. ఇక ట్రోలింగ్‌కి దిగొస్తారు. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే ఎన్నోసార్లు జరిగాయి.
Jr NTR: కళ్యాణ్ అన్న కెరీర్‌లో అమిగోస్ ఓ మైల్‌స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది
అంతెందుకు.. ఎన్టీఆర్30 సినిమా విషయంలోనూ జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవ్వడానికి ముందే.. ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు కానీ, అప్డేట్స్ మాత్రం రాలేదు. ఫైనల్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రీ-టీజర్ లాంచ్ చేశారు. అది చూసి.. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని, ఇకపై అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ అనుకున్నారు. తీరా చూస్తే, ఇప్పటిదాకా ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. దీంతో, అప్డేట్స్ ఎప్పుడిస్తారు? అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల హ్యాష్‌ట్యాగ్స్‌తో అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. లేటెస్ట్‌గా తారక్‌నే అడిగేశారు. ‘అమిగోస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన తారక్ వేదికపై ప్రసంగిస్తుండగా.. ఫ్యాన్స్ అడ్డగించి, ‘ఎన్టీఆర్30’ ఇవ్వాలని గట్టిగా అడిగారు. దీంతో.. తారక్ తనదైన శైలిలో ఫ్యాన్స్‌కి క్లాస్ పీకాడు.
Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం
తారక్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా చిన్న విన్నపం మాత్రమే. ఒక్కోసారి సినిమాలు చేస్తున్నప్పుడు చెప్పడానికి ఏమీ ఉండదు. ప్రతీరోజూ, ప్రతీ గంట ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. మీ ఆరాటం, మీ ఉత్సాహం అర్థం అవుతుంది. కానీ.. అదే ఉత్సాహం నిర్మాతలు, దర్శకుల పట్ల ఒత్తిడిగా మారుతోంది. అభిమానులు కోరుకుంటున్నారని ఏదో ఒక అప్డేట్ ఇవ్వలేము. ఒకవేళ ఏదిపడితే అది ఇస్తే, ఆ అప్డేట్ మీకు నచ్చదు. రివర్స్‌లో నిర్మాతల్నే తిడతారు. ఈ అప్డేట్ విషయంలో నాతోపాటు ప్రతిఒక్కరూ ప్రెజర్‌కి గురి అవుతున్నారు. ఏదైనా అప్డేట్ ఉంటే, మా భార్యల కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకంటే మీరే మాకు ముఖ్యం. దయచేసి ఎక్కడో ఏవేవో వార్తలు చదివి, అప్డేట్ కావాలని, నిర్మాతలపై ఒత్తిడి పెంచొద్దు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈరోజు మన తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబలైజేషన్‌లో ఉందని, సినిమా తీయాలంటే చాలా కష్టపడాల్సి వస్తోందని తారక్ పేర్కొన్నాడు. ఎంతో ఫోకస్ పెట్టి, అద్భుతమైన రిజల్ట్ వచ్చేలా చేయాలన్న తాపత్రయంతో అందరూ కష్టపడుతున్నామన్నాడు. కాబట్టి.. అప్డేట్స్ అంటూ నిర్మాతలపై ప్రెజర్ చేయకండని తారక్ విజ్ఞప్తి చేశాడు. ఇదే సమయంలో ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ కూడా ఇచ్చాడు. తమ సినిమాని ఫిబ్రవరిలో లాంచ్ చేస్తామని, మార్చి 20 లోపే షూటింగ్ మొదలుపెడతామని క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 05వ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని కూడా పండగలాంటి వార్త చెప్పాడు.