Jr NTR: దేవర బ్లాక్ బస్టర్.. ఎన్టీఆర్ ఎమోషనల్ నోట్
- దేవర బ్లాక్ బస్టర్
- ఎన్టీఆర్ ఎమోషనల్ నోట్
- స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR pens a special thank you note to his team, audience and fans for Devara Part 1 Sucess: సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర సినిమా.. 500 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయి.. ఇప్పటికీ థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో.. దేవరను విజయవంతం చేసినందుకు.. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ.. ఒక స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్. దేవర పార్ట్ 1’కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.
Balayya Boyapati 4: బాలయ్య ఫాన్స్ ఊపిరి పీల్చుకోండి !
Also Read
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు మరియు హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ‘దేవర పార్ట్ 1’ చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
Grateful. pic.twitter.com/YDfLplET7S
— Jr NTR (@tarak9999) October 15, 2024
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!