NTR : మాటల్లో చెప్పలేను అంటూ తారక్ స్పెషల్ నోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR తాజాగా షేర్ చేసిన ఓ సుదీర్ఘ నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తాజా చిత్రం RRR థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి మ్యాజిక్ కు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా, ఎన్టీఆర్ కూడా అప్సెట్ అయ్యాడని, అందుకే RRR సక్సెస్ పార్టీకి హాజరు కాలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ ఓ సుదీర్ఘ నోట్ విడుదల చేశారు.
Read Also : Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
యాక్షన్ డ్రామా RRRలో భీమ్‌గా నటించిన తారక్ ఆ స్పెషల్ థ్యాంక్స్ నోట్ లో సినిమాని గ్రాండ్ హిట్ చేయడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రామ్ చరణ్, రాజమౌళి, సహ నటీనటులు, నిర్మాతలు, మిగిలిన టెక్నీషియన్లు, అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఇంకా ఎన్నో మంచి సినిమాలతో అలరిస్తానని తన అభిమానులకు వాగ్దానం చేశారు తారక్. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పట్ల, అలాగే సినిమాలో తన పాత్ర పట్ల పూర్తి సంతృప్తిగా, సంతోషంగా ఉన్నట్టు తెలిసిపోతోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో కనిపించనున్నాడు. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ స్పెషల్ నోట్ ఇదే…
I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!