NTR: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు. వరుణ్- లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్ళికి అటెండ్ కాలేదు. కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే వరుణ్ పెళ్ళికి హాజరయ్యారు హైదరాబాద్ లో పెళ్లి పెట్టుకుంటే.. ఇండస్ట్రీ మొత్తం మెగా ఇంట్లోనే ఉండేది. ఎందుకంటే .. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఆహ్వానం అంటే.. కాదనేవారు ఎవ్వరు ఉండరు. కానీ, ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో మెగా కుటుంబమే ఎవరిని పిలవలేదు. ఇక నవంబర్ 5 న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ మాత్రం జరగనుంది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం హాజరు అవుతుందని సమాచారం. ఇకపోతే వరుణ్ – లావణ్య.. ఇటలీలో జరిగే పెళ్ళికి ప్రత్యేకంగా కొంతమంది గెస్ట్ లను పిలిచినట్లు తెలుస్తోంది. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నాడట.
Ram Charan: బాబాయ్ తో అబ్బాయ్.. ఇది కదా పిక్ ఆఫ్ ది డే అంటే..
స్వయంగా వరుణ్ -లావణ్య కలిసి వెళ్లి ఎన్టీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే.. దేవర షూటింగ్ వలన ఎన్టీఆర్ రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, రిసెప్షన్ కు మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పినట్లు టాక్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. దేవర షూటింగ్ కోసం గోకర్ణ వెళ్ళాడు. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ మూడురోజులు షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ 5 న హైదరాబాద్ లో టైగర్ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే వరుణ్- లావణ్య రిస్పెషన్ వరకు ఆగాల్సిందే.