Site icon NTV Telugu

Kota Srinivas Death : కోట శ్రీనివాస్ కు ఎన్టీఆర్, మహేశ్ సంతాపం..

Ntr

Ntr

Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణం అటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంపై జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ తెలుగులో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

Read Also : Venkaih Naidu : గొప్ప మానవతా వాది.. ‘కోట’కు వెంకయ్య నాయుడు నివాళి

కోట శ్రీనివాస రావు మరణం బాధ కలిటించింది. ఆయన మరణం సినీ ఇండస్ట్రీతో పాటు ఆయనతో సంబంధం ఉన్న వారికి తీరని లోటు. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు మహేశ్ బాబు. వీరితో పాటు రవితేజ, నాని, నారాయణ మూర్తి లాంటి వారు కూడా సంతాపం ప్రకటిస్తూ వచ్చారు.

Read Also : Kota Srinivas Death : కోట మరణంపై బండి సంయ్, ఈటల సంతాపం..

Exit mobile version