Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. కర్ణాటకలో మొన్నటి వరకు షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ సెట్స్ నుంచి తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. చూస్తుంటే చాలా రగ్గుడ్ లుక్ లో ఉన్నారు. కాస్త బక్కగా మారిపోయిన ఎన్టీఆర్.. గుబురు గడ్డంతో కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి లుక్ లో గతంలో కనిపించాడు. మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నాడు.
Read Also : Catherine Tresa : ‘మెగా’ ఆఫర్ కొట్టేసిన బన్నీ హీరోయిన్..
ఓ వైపు వార్-2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అది ఇంకా రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 2026 జూన్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ మూవీ అంటే కచ్చితంగా ఎలివేషన్లు ఉండాల్సిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఎలివేషన్లు ఉంటాయో చూడాలి. ఈ మూవీలో ఇంకా నటీనటులను తీసుకుంటూనే ఉన్నారు.
Read Also : Thudarum : మోహన్ లాల్ సినిమా సరికొత్త రికార్డ్